చీరాల : కొత్తపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన జెడ్‌పి పాఠశాల విద్యార్ధుల భవిష్యత్తుకు ఎంఎల్ఎనే పూర్తి బాధ్యత వహించాలని వైసిపి ఇన్‌ఛార్జి యడం బాలాజి కోరారు. చీరాల వైసిపి కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తపేటలో పాఠశాలకు క్రీడా మైదానం ఎక్కడ ఉందని, అపార్ట్‌మెంట్‌లో తాత్కాలికంగా తరగతులు నిర్వహించేందుకు నిబంధనలు వర్తించవాని వైసిపి ఇన్‌ఛార్జి యడం బాలాజీ ప్రశ్నించారు. వైసిపి కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నాలుగేళ్లుగా నియోజకవర్గంలో ప్రజల సమస్యలు పట్టించుకోని ఎంఎల్ఎకు ఇప్పుడే పేదలకు ఇళ్లస్థలాలు గుర్తొచ్చాయాని ప్రశ్నించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కులాల వారీగా ప్రజలను విడదీసి ప్రవేశపెట్టిన పథకాలు కనీసం అర్హులకు అందలేదని ఆరోపించారు. గడిచిన తొమ్మిదేళ్లలో నిర్మించిన ఇళ్లకు ఎక్కడా పట్టాలు ఇవ్వలేదని, పట్టాలు ఇవ్వకుండా కట్టించిన ఇళ్లలో నివాసం ఉంటుంన్న పేదలు ఎవ్వరైనా ఎంఎల్ఎకు వ్యతిరేకంగా ఉంటే ఇళ్లు రద్దు చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. తాము అధికారానికి వస్తే అలాంటి ఇబ్బందులు లేకుండా లబ్దిదారునికే హక్కు కల్పిస్తూ పట్టాలు ఇస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై అంతగా ఆసక్తి చూపే ఎంఎల్ఎ చీరాల పట్టణానికి మంజూరైన కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేశారో చెప్పాలన్నారు. సమావేశంలో వైసిపి పట్టణ అధ్యక్షులు బొనిగల జైసన్‌బాబు, మున్సిపల్ వైస్‌ఛైర్మన్ కొరబండి సురేష్, పాతచీరాల సర్పంచి రాజు శ్రీనివాసరెడ్డి, పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాసరావు, షేక్ సుభాని, సప్రం లవకుమార్, డేటా దివాకర్, కె శ్యామ్‌సన్ పాల్గొన్నారు.