చీరాల : కష్టువ్యాధి గ్రస్తులకు అవసరమైన స్వయం సంరక్షణ కిట్లు, పాదరక్షల సహాయార్ధం విజ్ఞాన భారతి ఉన్నత పాఠశాల విద్యార్ధులు సేకరించిన రూ.17వేల విరాళాన్ని పాఠశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్, మేజర్ తోట రోశయ్య చేతుల మీదుగా ఆంద్రప్రదేశ్ సెప్రసీ సొసైటీ ఫీల్డ్ సూపర్‌వైజర్ ఇ శశిధర్‌రెడ్డి, కమ్యునిటీ హెల్త్ వర్కర్ ఎ శ్రీనివాసరెడ్డికి సోమవారం అందజేశారు.
పాఠశాల ప్రన్సిపాల్ బి రాఘాకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో చెక్కును అందజేశారు. సామాజిక స్పృహతో విద్యార్ధులు చేసిన కృషిని విద్యాసంస్థల కమిటి అధ్యక్షులు జంపాల గంగాధరరావు అభినందించారు.