చీరాల : ఎంతటి లక్ష్యాన్నయినా సులభంగా సాధించాలంటే పట్టుదలే ఆయుధమని విశ్రాంత ప్రిన్సిపాల్ బత్తుల బ్రహ్మారెడ్డి పేర్కొన్నారు. వైఎ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల 52వ వార్షికోత్సవ సభలో ఆయన మాట్లడారు. సోమవారం కళాశాల ఆవరణలో వార్షికోత్సవ సభ నిర్వహించారు. విద్యార్ధులు చదువులతోపాటు వివిధ అంశాలపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోగలరి తెలిపారు. కళాశాల ప్రన్సిపాల్ డాక్టర్ సిహెచ్ రమణమ్మ మాట్లాడుతూ రానున్న పరీక్షలలో ఉత్తమ మార్కులు సాధించాలని సూచించారు. అనంతరం విద్యార్ధులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో కళాశాల విద్యార్దినులు తైక్వాండో విన్యాసాలు ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈసందర్భంగా తైక్వాండో కోచ్ సయ్యద్ సలాఉద్దీన్‌ను అభినందించారు. కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బి రంగస్వామి, సబ్ ట్రజరీ ఆఫీసర్ కె భాగ్యలక్ష్మి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఎం రాఘవేంద్రరావు, విద్యార్ధి నాయకురాలు ఎస్ పావని పాల్గొన్నారు.