Home క్రైమ్ ముస్లిం యువ‌కుల‌కు ముస్లిం మ‌త్త‌పెద్ద‌లచే శిరోముండ‌నం

ముస్లిం యువ‌కుల‌కు ముస్లిం మ‌త్త‌పెద్ద‌లచే శిరోముండ‌నం

491
0

వేట‌పాలెం : ప్రకాశం జిల్లా వేటపాలెం మండలంలో ఆదివారం రాత్రి విజయవాడకు చెందిన ఇద్దరు ముస్లిం యువకులు మ‌తానికి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేస్తున్నారు. అది గ‌మ‌నించిన స్థానిక ముస్లిం పెద్దలు ఇద్ద‌రు యువ‌కుల‌ను అదుపులోకి తీసుకున్నారు. వేటపాలెం పెద్దమ్మ సీదిలో ఇద్దర్నీ కూర్చోబెట్టి ఎక్కడ నుండి వచ్చారని ప్రశ్నించారు. వారి నుండి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మసీదులోనే ఇద్ద‌రు యువ‌కుల‌కు గుండు చేయించారు.

అనంత‌రం ఇద్ద‌రినీ స్థానిక పోలీసులకు అప్పగించారు. గ్రామంలోని ముస్లిం యువకులకు దేవుడు లేడని, చనిపోయి తరువాత కూడా మన ఆత్మ మనదగ్గరే ఉంటుందని, మీరు దేవుణ్ణి నమ్మ వద్దని ప్రచారం చేస్తున్నట్లు ముస్లిం మ‌త‌ పెద్దలు పోలీసుల‌కు తెలిపారు. ప్రస్తుతము అబ్దుల్ కరీం, అఖిల్ అనే ఇద్దరు ముస్లిం యువకులు వేటపాలెం పోలీస్ స్టేషన్లో ఉన్నారు. వీరిద్ద‌రు ఎక్క‌డి నుండి వ‌చ్చారు? మ‌త పెద్ద‌లు అంత‌గా ఎందుకు అనుమానించారు? గుండు చేయించేంతగా చేసిన త‌ప్పుడు ప్ర‌చారం ఏంటి? వ‌ంటి వివ‌రాలు పోలీసుల విచార‌ణ‌లో తెలియాల్సి ఉంది.