చీరాల : సీపీఎస్ రద్దయ్యే వరకు ఉపాధ్యాయుల పోరాటం ఆగదని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి గౌరబత్తుని సూరిబాబు అన్నారు. ఎస్టీఎఫై ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏంజిఓ భవనంలోని యూటీఎఫ్ కార్యాలయం వద్ద యూటీఎఫ్, ఎస్టీఎఫై జెండాలను ఆవిష్కరించారు. సీపీఎస్ రద్దుకు జరిగే పోరాటాల్లో ఉపాధ్యాయులు పాల్గొనాలని కోరారు.
ఎస్టీఎఫై జెండాను సీనియర్ నాయకులు గవిని నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయిలో అన్ని ఉపాధ్యాయ సంఘాలను ఒకే వేదికపైకి తెచ్చిన ఘనత యూటీఎఫ్ దేనన్నారు. తొలి జాతీయ ప్రధాన కార్యదర్శిగా దాచురి రామిరెడ్డి పనిచేశారన్నారు. యూటీఎఫ్ జెండాను కె వీరాంజనేయులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేవివి రాష్ట్ర కార్యదర్శి కుర్రా రామారావు, షేక్ ఖాసిం, ఎస్ విజయవర్ధన్ రాజు, పి సురేష్, చంద్రారెడ్డి, కుర్రా శ్రీనివాసరావు, బండి బిక్షాలుబాబు, బిరుదు పిచ్చయ్య, బి వెంకటేశ్వర్లు, హేమంత్, శేషగిరి, రవి పాల్గొన్నారు.