చీరాల : సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న 2018ఎంసెట్ పరీక్షలు రెండో రోజూ ప్రశాంతంగా జరిగినట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు. సోమవారం నాడు 960మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 907మంది అభ్యర్ధులు హాజరైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి రవికుమార్ తెలిపారు. పరీక్షకు హాజరైన విద్యార్ధులకు, వారి వెంట వచ్చిన సంరక్షకులకు అల్పాహారం, మజ్జిగ, తాగునీళ్లు, బస్సు సౌకర్యం ఉచితంగా కళాశాల యాజమాన్యం కల్పించినట్లు తెలిపారు.