చీరాల : ప్లక్స్ టెక్ సొల్యూషన్స్ కంపెనీ యుఎస్ఐటి రిక్రూటర్ ఉద్యోగాల కోసం ప్రకాశం జిల్లా చీరాల సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు. ప్రాంగణ ఎంపికల్లో 13మంది విద్యార్ధులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు. బిటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్న 35మంది విద్యార్ధులు ఎంపికలకు హాజరైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి రవికుమార్ తెలిపారు. ముఖాముఖి ఇంటర్వూల్లో సిఎస్ఇ విభాగం నుండి ఇద్దరు, ఇసిఇ నుండి 8మంది, ఇఇఇ నుండి ఇద్దరు, సివిల్ విభాగం నుండి ఒకరు మొత్తం 13మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల ప్లేస్‌మెంట్ ఆఫీసర్ ఎన్ పూర్ణచంద్రరావు తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్ధులను అభినందించారు.