Home ప్రకాశం సంక్షేమ హాస్టళ్లలో వైద్యశిభిరాలు ఏర్పాటు చెయ్యాలి : ఎస్ఎఫ్ఐ జిల్లా కార్య‌ద‌ర్శి సిహెచ్ వినోద్‌

సంక్షేమ హాస్టళ్లలో వైద్యశిభిరాలు ఏర్పాటు చెయ్యాలి : ఎస్ఎఫ్ఐ జిల్లా కార్య‌ద‌ర్శి సిహెచ్ వినోద్‌

417
0

చీరాల : వాతావరణంలో మార్పులు కారణంగా జిల్లా వ్యాప్తంగా సీజనల్ జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్య‌ద‌ర్శి సిహెచ్ వినోద్ పేర్కొన్నారు. సంక్షేమ హాస్టల్లోని విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి హాస్టల్లో వైద్య శిబిరం ఏర్పాటు చేయాల‌ని కోరారు. జ్వరాల నుండి విద్యార్థులను రక్షించాలన్నారు. హాస్టల్లో మరుగుదొడ్లు శుభ్రంగా ఉండటం లేదని పేర్కొన్నారు. కిటికీలకు దోమ తెరలు లేక దోమల సమస్యతో విద్యార్ధుల‌కు నిద్రలు ఉండటం లేదని తెలిపారు. జిల్లా సంక్షేమాధికారులు వెంటనే చొరవ తీసుకుని హాస్టళ్ల పారిశుధ్యం, విద్యార్థుల సంక్షేమంపై దృష్టి సారించాలని కోరారు. వైద్యాధికారులు సంక్షేమ హాస్టళ్లకు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. సమావేశంలో మండల అధ్యక్ష, కార్యదర్శులు బోసుబాబు, పూర్ణచంద్ర , గర్ల్స్ నాయకురాలు చరిత పాల్గొన్నారు.