Home ప్రకాశం సెప్టెంబర్ 15న నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం వామపక్షాల మహా గర్జన

సెప్టెంబర్ 15న నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం వామపక్షాల మహా గర్జన

406
0

చీరాల :  నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం మహాగర్జన సభ సెప్టెంబర్ 15న విజయవాడలో నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చీకటి శ్రీనివాసులు తెలిపారు. చీరాల బాపనమ్మ కల్యాణ  మండపంలో సిపిఎం ప్రాంతీయ కమిటీ, సభ్యుల సమావేశం శనివారం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 15న చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రద చెయ్యాలని కోరారు.

రాష్ట్రంలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసిపి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటు ప్రజా సమస్యలను గాలికి వాడిలారని పేర్కొన్నారు. ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటుకు వామపక్షాలు కలిసివచ్చే పార్టీలు, ప్రజా సంఘాలతో ముందుకు పోతున్నట్లు చెప్పారు. ప్రజా రాజకీయాల కోసం వామపక్షాల సభను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రాంతీయ కార్యదర్శి ఎన్ బాబురావు, నాయకులు వసంతరావు, కందుకూరి ఎలమంద, దేవతోటి నాగేశ్వరరావు, డి నారపరెడ్డి, పి సాయిరామ్, గవిని నాగేశ్వరరావు, ఏవి రమణ, జి గంగయ్య, జె రోశయ్య, సత్యమూర్తి, జెవి ప్రసాద్, ముసలారెడ్డి, బి శ్రీను పాల్గొన్నారు.