చీరాల : ప్రభుత్వ వైద్యశాలలో వయో వృద్దులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పించాలని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చుక్కపల్లి రామకోటయ్య ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాల సూపరింటిండెంట్ డాక్టర్ తిరుపాలుకు సోమవారం వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ వైద్యశాలలో సిటి స్కాన్, డయాలసిస్ వంటి ఆధునిక సౌకర్యాలతో జిల్లాలోనే ఉత్తమ వైద్యశాలగా అభివృద్ది చేశారని పేర్కొన్నారు. మహిళలకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లే సీనియర్ సిటిజన్లకూ ఏర్పాట్లు చేయాలని కోరారు.
వైద్య ఖర్చులు పెరగడంతో పేదలు ప్రవేటు వైద్యశాలకు వెళ్లే పరిస్థితి లేనందున ప్రభుత్వ వైద్యశాలలో సౌకర్యాలు మరింత అభివృద్ది చేయాలని కోరారు. ఓపి నమోదు వద్ద ఉదయంపూట ఎక్కువ సంఖ్యలో రోగులు లైన్లో ఉంటుండటం వలన వృద్దులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. వినతి పత్రం అందజేసిన వారిలో సీనియర్ సిజిటన్స్ అసోసియేషన్ ప్రతినిధులు గాదె హరిహరరావు, ఎ రామారావు ఉన్నారు.