చీరాల : పేరాల ఎఆర్ఎం ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం ద్వారా ఏకరూప దుస్తులు అందని పేద విద్యార్ధులకు దాతల సహకారంతో ఏకరూప దుస్తులు సమకూర్చారు. రూ.30వేల విలువైన ఏకరూప దుస్తులను కామాక్షి కేర్ హాస్పిటల్ అధినేత తాడివలస దేవరాజు, జొన్నలగడ్డ రంజన్ విజయలక్ష్మి కుమార్తె సుచిత పదోతరగతిలో 10కి 10జిపిఎ సాధించుకున్న సందర్భంగా ఇచ్చిన రూ.10వేలతో దుస్తులు సమకూర్చినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి సాల్మన్‌రాజు తెలిపారు. ఈసందర్భంగా దేవరాజు మాట్లాడుతూ తాను పాఠశాల పూర్వవిద్యార్ధినైనందుకు గర్వపడుతున్నట్లు తెలిపారు.
కౌన్సిలర్ గుద్దంటి సత్యనారాయణ మాట్లాడుతూ దాతల సేవలను అభినందించారు. పాఠశాలలో డైనింగ్ హాలు, సైకిల్ స్టాండు, వాటర్ ప్లాంట్, సిసికెమేరాలు, ఆహ్లదకరమైన పాఠశాల వాతావరణం ప్రభుత్వ నిధులతో సమకూర్చుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సురేష్, గాంధీ, రమణ, సుందరరామిరెడ్డి, సుబ్రమణ్యకుమార్, వెంకటేశ్వరరావు, యలమందేశ్వరరావు, శ్రీనివాసరావు, షబ్బీర్ ఆలీ, శివప్రసాద్, ప్రసాద్, సుశీల, ప్రసన్న, బషీరా, రేవంత్, కుమార్, ధనుంజయ పాల్గొన్నారు.