చీరాల : ఆర్టీసీ కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా బస్టాండు ఆవరణలో ధర్నా నిర్వహించారు. ధర్నా నుద్దేశించి ఎస్‌డబ్ల్యుఎఫ్ నాయకులు బి శ్రీనివాసరావు, ఎంప్లాయిస్ యూనియన్ డిపో కార్యదర్శి ఎస్ ఎలీషా మాట్లాడారు. ఆర్టీసీ నష్టాలకు ప్రధాన కారణం ఇందన ధరలు పెరగడమేనని పేర్కొన్నారు. ఆర్టీసీకి భారంగా మారిన పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని కోరారు. ధర్నాలో ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు జి సాయిబాబు, కె శ్రీనివాసరావు, డిసిహెచ్ శేఖర్, ప్రవీణ్, ఎ శ్రీనివాసరావు, ఎంఎస్ రావు, పుల్లయ్య, ఎజె రెడ్డి, సుబ్బారావు, రమేష్, రోశయ్య, షరీఫ్, ఆదినారాయణ, వెంటేశ్వర్లు, భార్గవరామ్, కెవి రమణయ్య, సరోజిని, సుజాతకుమారి, పి వెంకటేశ్వర్లు, యానాదిరావు, విఎస్ కుమార్, డి యేసు, షేక్ అబ్దుల్లా, పివి రావు పాల్గొన్నారు.