ఒంగోలు : సెప్టెంబర్ 29నుండి అక్టోబర్ 8వరకు ఉన్నత పాఠశాల, ప్రాధమికోన్నత పాఠశాల విద్యార్ధులకు మద్యంత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల ఉన్నత, ప్రాధమికోన్నత పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. విద్యా క్యాలెండర్ ప్రకారం ఆగష్టు నెల సిలబస్ వరకు పరీక్షలు వివరణాత్మక పద్దతిలో జరుగుతాయని వివరించారు. అక్టోబర్ 9నుండి 21వరకు దసరా శెలవులు ప్రకటించారు. అక్టోబర్ 22న పాఠశాల పునప్రారంభించాలని సూచించారు. ఎఫ్ఎ2 పరీక్షలను సెప్టెంబర్ 17నుండి 22లోపు పూర్తి చేయాలని సూచించారు. పరీక్షలు పూర్తయ్యాక సిఎస్ఇ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని పేర్కొన్నారు.
సెప్టెంబర్ 29న ఉదయం గం.10-12.45వరకు 6, 8, 10తరగతులకు తెలుగు, కాంపోజిట్ తెలుగు 80మార్కులకు(ఒ3టి), 7, 9తరగతులకు సంస్కృతం 20మార్కులకు(04ఎస్), మద్యాహ్నం గం.2.00 – 4.45వరకు 7, 9తరగతులకు తెలుగు| కాంపోజిట్ తెలుగు 80మార్కులకు (03టి), 6, 8, 10తరగతులకు సంస్కృతం 20మార్కులకు (04ఎస్), అక్టోబర్ 1న ఉదయం 6, 8, 10తరగతులకు హిందీ, మద్యాహ్నం 7, 9తరగతులకు హిందీ, 3న ఉదయం 6, 8, 10తరగతులకు ఇంగ్లీషు, మద్యాహ్నం 7, 9తరగతులకు ఇంగ్లీషు, 4న 6, 8, 10తరగతులకు గణితం, మద్యాహ్నం 7, 9 తరగతులకు గణితం, 5న ఉదయం 8, 10తరగతులకు భౌతిక శాస్ర్తం, 6వ తరగతికి సైన్సు, మద్యాహ్నం 9వ తరగతి భౌతిక శాస్ర్తం, 7వ తరగతి సైన్సు, 6న 8, 10తరగతులకు జీవ శాస్ర్తం, మద్యాహ్నం 9వ తరగతి జీవశాస్ర్తం, 8న 6, 8, 10తరగతులకు సాంఘీక శాస్ర్తం, మద్యాహ్నం 7, 9తరగతులకు సాంఘీక శాస్ర్తం పరీక్షలు జరుగుతాయని టైంటేబుల్ ప్రకటించారు.