ఒంగోలు : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 16న “మద్యపానము, మాదక ద్రవ్యాలు వాడకం వద్దు“ అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు రెడ్‌క్రాస్ జిల్లా ఛైర్మన్ డాక్టర్ గుండవరపు రాఘవ్ తెలిపారు. పోటీల్లో పాల్గొనే విద్యార్ధులకు ఆగష్టు 31నాటికి 14నుండి 18సంవత్సరాలలోపు వారై ఉండాలని సూచించారు. అంటే 2000సంవత్సరం ఆగష్టు 31నుండి 2005ఆగష్టు 31మద్యలో పుట్టిన వారై ఉండాలని సూచించారు. పోటీలను జిల్లాలో నాలుగు కేంద్రాల్లో నిర్వహిస్తారని తెలిపారు. ఒంగోలు శ్రీహరి్షణీ డిగ్రీ అండ్ పిజికాలేజిలో సెంటర్‌కు ఎం సంపత్‌కుమార్ (63036 83775), చీరాల వైఎ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజిలో సెంటర్‌కు ఇందుర్తి హనుమంతరావు (98857 33845), పొదిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల సెంటర్‌కు షేక్ అబ్దుల్ కలాం (94902 81176), కనిగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల సెంటర్‌కు సోమిశెట్టి శ్రీనివాస్ (92904 64292) బాద్యులుగా వ్యవహరిస్తారని తెలిపారు.
పోటీలు ఆంగ్ల, తెలుగు మాధ్యమాల్లో వేరువేరుగా నిర్వహిస్తామని తెలిపారు. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో వేరువేరుగా ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఉంటాయని తెలిపారు. ఎంపికైన ఆరుగురు విద్యార్ధులను రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో 13జిల్లాల నుండివచ్చిన ఉత్తమ వ్యాసాలను కలిపి వాటి నుండి ఆంగ్ల, తెలుగు మాధ్యమాల్లో వేరు వేరుగా ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన వ్యాసాలకు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆంద్రప్రదేశ్ శాఖ వార్షికోత్సవ సభలో ప్రధమ బహుమతి రూ.10వేలు, ద్వితీయ బహుమతి రూ.6వేలు, తృతీయ బహుమతి రూ.3వేలతోపాటు దృవీకరణ పత్రాలను గవర్నర్ చేతుల మీదుగా అందజేస్తామని తెలిపారు. పోటీల్లో పాల్గొనదలచిన విద్యార్ధులు ఈనెల 12న సాయంత్రం 5గంటల లోపు 94902 81176నంబరుకు గాని ircsongole@gmail.com మెయిల్ ద్వారాగాని పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.