చీరాల : ఆర్టీసీ ఎన్నికలు ఆసక్తిగా జరుగుతున్నాయి. ఎన్ఎంయు ఒకవైపు ఎంప్లాయిస్, ఎస్‌డబ్ల్యుఎఫ్ కూటమి ఒకవైపు శిభిరాలు ఏర్పాటు చేశారు. కార్మికులను ఎవరికి వారు ఆహ్వానించి ఓట్లు వేయించుకునే ప్రతయత్నం చేస్తున్నారు. ఇటీవలే ఆర్టీ కార్మికులకు 19శాతం ఐఆర్ సాధించి కార్మికులకు మేలు చేకూర్చామని ఎన్ఎంయు నేతలు ప్రచారం చేసుకుంటుండగా తక్కువ మంది కార్మికులు, తక్కువ ఆర్టీసీ ఆదాయం ఉన్న రోజుల్లో ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో 27శాతం ఐఆర్ సాధించామని ఇయు కూటమి ప్రచారం చేస్తుకుంటున్నారు. ఎన్ఎంయు చేసిన ఒప్పందం కార్మికులకు నష్టం చేసేదని ప్రచారం చేశారు. అయితే కార్మికులు ఎవరికి పట్టం కడతారో సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.