చీరాల : ముందు ఖాళీ స్థలమే తీసుకుంటామని చెప్పి కొలతలు వేశారు. గుర్తులు పెట్టారు. కానీ తీరా రోడ్డు నిర్మాణం చేసే సమయంలో ఇళ్లు కూడా తీసేయాలని గుర్తులు వేస్తున్నారు. అదేంటని ప్రశ్నిస్తే అదంతే… ఇళ్లు ఖాళీ చేయాల్సిందేనని ఒంగోలు – దిగమర్రు జాతీయ రహదారి నిర్మాణ అధికారులు ప్రసాదనగరంలో బైపాస్ రోడ్డు వెంబడి నివాసం ఉంటున్న బాధితులను ఆదేశించారు. దీంతో బాధితులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించారు. బాధితుల ఆందోళనకు వైఎస్ఆర్‌సిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి యడం బాలాజీ, డాక్టర్ వరికూటి అమృతపాణి, మున్సిపల్ వైస్‌ఛైర్మన్ కొరబండి సురేష్ మద్దతు ప్రకటించారు. ఆందోళన అనంతరం చీరాల తహశీల్దారుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో బాధితులతోపాటు కొత్తపేట మాజీ సర్పంచి చుండూరి వాసు, వైసిపి నాయకులు యడం రవిశంకర్ పాల్గొన్నారు.