Home ప్రకాశం నిబద్ధతకు నిలువెత్తు రూపం అప్పారావు

నిబద్ధతకు నిలువెత్తు రూపం అప్పారావు

566
0

ఒంగోలు : ప్రజాశక్తి సంపాదకులు ఎంవిఎస్ శర్మ మాట్లాడుతూ అప్పారావు జ్ఞాపకాలు ఏడాది గడిచినా నేటికి సజీవంగా ఉండటానికి ఆయన ప్రజలు, ఈ గడ్డతో ఉన్న అనుబంధం, నిబద్ధత సజీవంగా నిలిపింది.

కోబ్రా స్టింగ్ ఆపరేషన్ పెద్ద పెద్ద పత్రికలు, టివి చానెల్స్ అడ్డంగా దొరికాయి. హిందు మతం పేరుతో వివాదాలు ఎలా రెచ్చగొడుతుందో వివరించారు. మీడియా ఏవిధంగా అమ్ముడు పోతుందో కోబ్రా పోస్ట్ బయట పెట్టింది. దీనిని ప్రజాశక్తి తప్ప ఇతర పత్రికలు ప్రచురించలేదు. ఇంకా కొన్ని పత్రికలు విలువలకు కట్టుబడి ఉన్న పత్రికలు ఉన్నాయి. నిబద్ధత, విలువల కోసం పనిచేసిన వ్యక్తి పోనకల అప్పారావు అన్నారు.

ప్రజాశక్తి పూర్వ చైర్మన్ వి కృష్ణయ్య మాట్లాడుతూ అప్పరావుకు కొన్ని ప్రేత్యేకతలున్నాయి. నవ్వుతూ, నవ్విస్తున్నట్లే అప్పారావు కతనాలో, భాషలోనూ కనిపించేది. అది వామపక్ష భావజాలంపై ఉన్న అవగాహనతోనే సాధ్యమైనది.

తూర్పు ప్రకాశం జిల్లా కార్యదర్శి పునాటి ఆంజనేయులు మాట్లాడుతూ పనిపట్ల నిబద్ధత, బాధ్యతగా, అందరికి ఆమోదయోగ్యంగా పత్రికను నడిపిన అనుభవం, నైపుణ్యం అప్పరావుకు ఉన్నది. జిల్లా సమస్యలను అవగతం చేసుకుని అందరికి ఆమోదయోగ్యంగా తీర్చి దిద్దారని అన్నారు.

కౌలురైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి నాగబోయిన రంగారావు మాట్లాడుతూ అప్పారావు ఇంకా మన మద్యే ఉన్నట్లే ఉన్నది. అప్పారావు స్పూర్తితో పత్రికను ముందుకు తీసుకెళ్లడంలోనే ఉన్నది.

కలగానే మాగాణి శీర్షికతో ప్రచురించిన కథనానికి పోనకల అప్పారావు స్మారక అవార్డును శింగరాయకొండ విలేకరి ఫణిదపు రవికుమార్ కు అందజేశారు.

సభకు ప్రజాశక్తి బ్యూరో ఇంచార్జ్ ఎస్వీ బ్రహ్మం అధ్యక్షత వహించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జాలా అంజయ్య, సిపిఎం తూర్పు జిల్లా కార్యదర్శి పునాటి ఆంజనేయులు, ప్రజాశక్తి మేనేజర్ ఎంఎల్వి ప్రసాదరావు, అప్పారావు సతీమణి పోనకల రజిని, విశ్రాంత జిల్లా జడ్జ్ నాగేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్ ఆర్ రామకృష్ణ, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి హనుమంతరావు, జివి కొండారెడ్డి, డెస్క్ ఇంచార్జ్ రాజేష్ పాల్గొన్నారు.