చీరాల : అంతర్జాతీయ జర్నల్లో సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధి, అధ్యపాకులు రూపొందించిన పరిశోధనా పత్రం ప్రచురితమైనట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఎఫెక్టివ్‌నెస్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్ పిరమిల్ ఎంటర్ ప్రైజెస్ అంశంపై ఎంబిఎ విద్యార్ధిని టి వాసంతి రూపొందించిన పరిశోధనాపత్రం ఇంటర్‌నేషనల్ జర్నల్ ఆఫ్ లేటెస్ట్ ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్‌లో ప్రచురించినట్లు ఎంబిఎ హెచ్ఒడి డాక్టర్ ఆర్ ఇమ్మానియేల్ తెలిపారు.
ఎంబిఎ విద్యార్ధిని టి వాసంతి ఎంబిఎ అధ్యాపకుడు పివివి కుమార్ పర్యవక్షణలో రూపొందించినట్లు తెలిపారు. ఎన్ ఎనాలిసిస్ ఆఫ్ కాష్యూసట్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా, వరల్డ్‌వైడ్ జర్నల్ ఆఫ్ మల్టి డిసిప్లినరీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లో ప్రచురితమైనట్లు హెచ్ఒడి డాక్టర్ ఆర్ ఇమ్మానియేల్ తెలిపారు.