చీరాల : రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంఎల్ఎ ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ఈనెల 24న ఎన్ఆర్అంద్‌పిఎం ఉన్నత పాఠశాల ఆవరణలోని ఓపెన్ ఎయిర్ ధియేటర్‌లో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ సీనియర్ కౌన్సిలర్ గుద్దంటి సత్యనారాయణ, టిడిపి మండల అధ్యక్షులు బుర్ల మురళీకృష్ణ తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలోని ఛైర్మన్ ఛాంబర్‌లో గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్దిదారులకు అందించడంలో సమస్యలున్నా, ఇతర సమస్యలు పరిష్కారానికి రాజకీయాలకు అతీతంగా ఎంఎల్ఎ ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ప్రజావేదిక జరుగుతుందని తెలిపారు. చీరాల పట్టణం, చీరాల రూరల్, వేటపాలెం మండలాల్లో ఒక్కొక్క చోట ఒక్కో శనివారం ప్రజావేదిక జరుగుతుందని తెలిపారు. ఈనెల 24న ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ ప్రారంభిస్తారని తెలిపారు.
సమావేశంలో కౌన్సిలర్ కల్లగుంట అంజమ్మ, కె ప్రకాష్, వేటపాలెం మండల మాజీ ఉపాధ్యక్షులు మార్పు గ్రెగోరి, సుధీర్, మాజీ కౌన్సిలర్ శీలం శ్యామ్‌బాబు, గలబ పరశురాం పాల్గొన్నారు.