చీరాల : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్హులైన దివ్యంగులుకు కూడు, గుడ్డ, గూడు కల్పించాలని, స్థానిక సంస్థలలో 4శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ దివ్యాంగులు ఆత్మగౌరవ యాత్ర చేపట్టారు. యాత్ర సోమవారం చీరాల చేరుకుంది. ఈ సందర్భంగా చీరాల తహశీల్దారు కార్యాలయంలో డిమాండ్లలతో కూడిన వినతి పత్రాన్ని అందచేశారు. సంఘం రాష్ర్ట అధ్యక్షుడు నీలా జోజిబాబు మాట్లాడుతూ దివ్యంగులందరికి పెన్షన్ సమానంగా రూ.3వేలకు పెంచాలని డిమాండు చేశారు. పెండింగ్ పెన్షన్లను మంజూరు చేయాలని కోరారు. స్థానిక సంస్థలలో 4శాతం రేసేర్వేషన్ కలిపించాలని డిమాండ్ చేశారు. దివ్యంగులకు ప్రత్యేక సబ్ ప్లాన్ చట్టం రూపొందించాలని అన్నారు. ప్రతి దివ్యంగుని కుటుంబానికి హెల్త్ కార్డును మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2016 దివ్యంగుల చట్టాన్ని అమలు పరిచాలని కోరారు. దివ్యంగులపై జరుగుతున్న దాడులను, అత్యాచారాలను, వివక్షతను అరికట్టేందుకు ప్రత్యేక దివ్యంగుల కమిషన్ నియమించాలి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మురుగుల సాంబశివరావు, కొమ్మూరి శుభాని, కంచర్ల ప్రసన్నకుమార్, మేరుగా కిరణ్ కుమార్, రమేష్, రామిరెడ్డి పాల్గొన్నారు.