కోదాడ : సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గానికి సినీహస్యనటుడు వేణుమాధవ్ స్వతంత్ర అభ్యర్ధిగా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. తహసీల్దారు కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. మూడు రోజుల క్రితం నామినేషన్ వేసేందుకు వచ్చినప్పటికీ తగిన పత్రాలు సమర్పించకపోవడంతో అధికారులు తిరస్కరించారు. తన మద్దతు దారులతో సోమవారం మరోసారి వచ్చి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. తన స్వస్థలం కావడంతో కోదాడ నుండే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు వేణుమాధవ్ ప్రకటించారు.