Home విద్య సెయింట్ ఆన్స్‌లో జాతీయ సేవా విభాగ వేడుక‌లు

సెయింట్ ఆన్స్‌లో జాతీయ సేవా విభాగ వేడుక‌లు

449
0

చీరాల : సెయింట్ ఆన్స్ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌లో సోమ‌వారం జాతీయ సేవా విభాగ దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. చ‌దువుతోపాటు విద్యార్ధులు సేవా రంగాల్లో ప‌నిచేయ‌డం ద్వారా స‌మాజంప‌ట్ల అవ‌గాహ‌న క‌లిగి, క్ర‌మ‌శిక్ష‌ణ అల‌వ‌డుతుంద‌ని క‌ర‌స్పాండెంట్ ఎస్ ల‌క్ష్మ‌ణ‌రావు పేర్కొన్నారు. ర‌క్త‌దాన శిభిరం, ఉచిత వైద్య శిభిరం, అవ‌గాహ‌న స‌ద‌స్సులు, ర్యాలీలు, ఆప‌ద స‌మ‌యాల్లో ఆర్ధిక స‌హాయం, మొక్క‌లు నాట‌టం, ఎయిడ్స్‌పై అవ‌గాహ‌న ర్యాలీలు, ఇంకుడు గుంట‌లు త‌వ్వ‌టం, రోడ్డు బ‌ద్ర‌త వారోత్స‌వాలు వంటి కార్య‌క్ర‌మాలు చేస్తున్న‌ట్లు ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ పి ర‌వికుమార్ పేర్కొన్నారు. సేవాకార్య‌క్ర‌మాల్లో విద్యార్ధుల భాగ‌స్వామ్యం బాగుంద‌ని ఎస్ఎస్ఎస్ అధికారి ఎం ప‌వ‌న్ పేర్కొన్నారు. ఎన్ఎస్ఎస్ యూనివ‌ర్శిటీ గుర్తింపు పొందిన‌ట్లు చెప్పారు. కార్య‌క్ర‌మంలో మేనేజ‌ర్ ఆర్‌వి ర‌మ‌ణ‌మూర్తి పాల్గొన్నారు.