Home ప్రకాశం సీఐటియు ఆధ్వర్యంలో మునిసిపల్ కార్మికుల ధర్నా

సీఐటియు ఆధ్వర్యంలో మునిసిపల్ కార్మికుల ధర్నా

394
0

చీరాల : సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు శుక్రవారం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు కార్యదర్శి ఎన్ బాబురావు మాట్లాడుతూ జీవో నెంబర్ 279రద్దు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ వర్కర్ల సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. చీరాల్లో సమ్మెలో ఉన్న కార్మికులపై బెదిరింపు చర్యలు మానుకోవాలని అధికారులకు సూచించారు. జీవో రద్దు అయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఇక్కడి కార్మికులను బెదిరిస్తే అన్ని సంఘాలతో ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చటించారు. కార్యక్రమంలో సిఐటియు అధ్యక్షులు డి నాగేశ్వరరావు, ఎం వసంతరావు, ఏవీ రమణ, సింగయ్య, శంకర్ పాల్గొన్నారు.