Home ప్రకాశం మునిసిపల్ ఉపాధ్యాయుల బదిలీలు చేయాలి

మునిసిపల్ ఉపాధ్యాయుల బదిలీలు చేయాలి

588
0

చీరాల : ప్రభుత్వ పాఠశాలల్లో సమస్య పరిశీలనకు ఎంఎల్సి విఠపు బాలసుబ్రహ్మణ్యం చీరాల నియోజకవర్గంలో పర్యటించారు. పట్టణంలోని పాఠశాలల తనిఖీ సమయంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మునిసిపల్ ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభుత్వంతో చర్చించాలని వినతి పత్రాన్ని ఇచ్చారు. అనంతరం ఎస్ఏఆర్ ఆర్ ఎమ్ ఉన్నత పాఠశాల, కొత్తపేట జెడ్పి ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఆయన వెంట యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కె వీరాంజనేయులు, పట్టణ అధ్యక్షుడు పి సురేష్, ప్రధాన కార్యదర్శి షేక్ జానిభాషా పాల్గొన్నారు.