చీరాల : కేసుల సత్వర పరిష్కారంలో రాజీమార్గమే రాజమార్గమని, దీనివల్ల కక్షిదారులకు, కోర్టువారికి సమయం ఆదా కావడంతోపాటు కక్షికాదులకు ఆర్ధిక భారం తగ్గుతుందని న్యాయమూర్తి ఎన్ కృష్ణన్‌కుట్టి పేర్కొన్నారు. రాజీపడి సర్దుకోవడం ద్వారా మానవ సంబంధాలు కూడా బాగుంటాయని చెప్పారు. దీనివల్ల గ్రామాల్లో ప్రశాంత జీవనం నెలకొంటుందన్నారు. కక్షిదారులు చట్టాలపై అవగాహన కలిగి ఉంటే నేరాలు అదుపులో ఉంటాయన్నారు. కోర్టు భవనాల ఆవరణలో శనివారం జరిగిన జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. లోక్ అదాలత్‌లో 50కేసులు పరిష్కరించారు. సదస్సులో న్యాయమూర్తి శ్రీనివాసరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవ రమేష్‌బాబు, రూరల్ సిఐ భక్తసత్సలరెడ్డి, పట్టణ సిఐ వి సూర్యనారాయణ పాల్గొన్నారు.