Home క్రైమ్ రిసార్ట్స్‌లో రేవ్‌ పార్టీలు – పోలీసుల దాడి

రిసార్ట్స్‌లో రేవ్‌ పార్టీలు – పోలీసుల దాడి

378
0

రంపచోడవరం : తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలోని కొన్ని రిసార్ట్స్‌లు అసాంఘిక కార్యక్రమాలకు వేదిక‌ల‌య్యాయి. తాజాగా శుక్రవారం అర్ధరాత్రి దేవరాతిగూడెం సమీపంలోని ఏ1 రిసార్ట్స్‌లో కొద‌రు రేవ్‌ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. యువ‌తీ, యువ‌కులు జంట‌లుగా చింతులేయ‌డం, రికార్డు డాన్స్‌లను మ‌రిపించేలా జరుగుతున్నట్లు రంపచోడవరం పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి వెళ్లి దాడి చేశారు. విశాఖపట్నానికి చెందిన 8 మంది అమ్మాయిలను, విజయవాడకు చెందిన మ‌రో 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరితోపాటు రిసార్ట్స్‌ నిర్వహకుడు మహర్షి అలియాస్‌ బాబ్జీని కూడా పోలీసులు అరెస్టు చేశారు. కోర్టుకు రెండు రోజులు సెలవుల కావ‌డంతో అరెస్ట్ చేసిన వారందరిని సోమవారం కోర్టులో హాజరుప‌ర్చ‌నున్న‌ట్లు సీఐ వెంకటేశ్వరరావు మీడియాకు తెలిపారు.