టంగుటూరు : ఎంఎల్ఎ డోలా శ్రీబాలవీరాంజనేయులు తూర్పునాయుడుపాలెంలోని తన కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన నిధిని బాధితులకు శనివారం అందజేశారు. అలకురపడుకు చెందిన లాఖంతోటి మోహకు రూ.30,000/-, మర్రిపూడి రతమ్మకు రూ.30,000/-, కారుమంచి గ్రామానికి చెందిన గుంపుల సదా లక్ష్మీకు రూ. 16,510, ఎమ్.నిడమనురు గ్రామానికి చెందిన దేవరపల్లి వెంకటేశ్వర్లుకు రూ.35,000/-, బెజవాడ కృష్ణమూర్తికి రూ.50,000/-, సురరెడ్డిపాలెంకు చెందిన మలినేని భార్గవకు రూ.30,000/- తూర్పునాయుడుపాలెం గ్రామానికి చెందిన ఏకుల విజయలక్ష్మికి రూ.20,000/-, వాసేపల్లికి చెందిన బాధితునికి రూ.15,000/-ల విలువ గల ముఖ్యమంత్రి సహయనిధి చెక్కులను ఎంఎల్ఎ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంసీసీ చైర్మన్ రామయ్య పాల్గొన్నారు.