Home ప్రకాశం ఎల్ఐసి ఉద్యోగుల‌చే అన్న‌దానం

ఎల్ఐసి ఉద్యోగుల‌చే అన్న‌దానం

483
0

చీరాల : ఎల్ఐసి ఉద్యోగుల సంఘం ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా వారం రోజుల‌పాటు రోజుకొక సేవా కార్య‌క్ర‌మం చేస్తున్న‌ట్లు ఎఐఐఇఎ జిల్లా కార్య‌ద‌ర్శి ఆర్‌విఎస్ రామిరెడ్డి పేర్కొన్నారు. దండుబాట‌లోని కోట‌య్య వృద్దాశ్ర‌మంలో గురువారం మ‌ద్యాహ్న భోజ‌నం ఏర్పాటు చేశారు. ఎల్ఐసి ఉద్యోగులు, ఏజెంట్లు క‌లిసి భోజ‌న ఏర్పాట్లు చేశారు. కార్య‌క్ర‌మంలో ఎఐఐఇఎ చీరాల‌ బ్రాంచ్ సెక్రటరీ కామ్రేడ్ భూపతి నాగేశ్వర రావు, అధ్యక్షులు కామ్రేడ్ టి విజయకుమార్, జాయింట్ సెక్రటరీ కామ్రేడ్ వై పూర్ణచంద్రరావు, ఏజెంట్స్ ప్రెసిడెంట్, సెక్రటరీ వివి సుబ్బారావుగారు, వేణు, ఎంబి నెహ్రు, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. శుక్ర‌వారం జైశంకర్ నగర్ లో ఉన్న ఎల్ఎస్ఎం ప్రాధ‌మిక పాఠ‌శాల విద్యార్ధుల‌కు నోటుపుస్త‌కాలు పంపిణీ చేస్తున్న‌ట్లు తెలిపారు.