చీరాల : ఈపూరుపాలెం పంచాయితీ పరిధిలో ఎపిఐఐసి ద్వారా ఆటోనగర్ నిర్మాణానికి గురువారం ఎంఎల్ఎ ఆమంచి కృష్ణమోహన్ శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. పారిశ్రామిక మౌళిక వసతుల కల్పన సంస్థ ఆధ్వర్యంలో చిన్నతరహా పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌళిక వసతులైన రోడ్లు, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించేందుకు రూ.5కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పారు. మూడు నెలల్లో అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. ఆటోనగర్ స్థల వివాదం గతంలో తన దృష్టికి వచ్చిన సమయంలో పరిష్కారానికి అధికారులతో చర్చించి పరిష్కరించామన్నారు. సభలో మండల ఉపాధ్యక్షులు నాదెండ్ల కోటేశ్వరరావు, ఈపూరుపాలెం సర్పంచి గుద్దంటి సరోజిని, మాజీ సర్పంచి గంజి వెంకటేశ్వర్లు, తహశీల్దారు ఎం వెంకటేశ్వర్లు, ఎంపిటిసి షేక్ బాషా, ఆటోనగర్ కమిటి ప్రతినిధులు పాల్గొన్నారు.