ఈపూరుపాలెం : కూలీ పనుల నిమిత్తం తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా బిర్‌కూర్ మండలం చొంచిప్లి వెళ్లిన ఈపూరుపాలెంకు చెందిన ఊట్ల నాగరాజు (26) కాలకృత్యాలు తీర్చుకునేందుకు అక్కడి గ్రామ ఊరచెరువు వద్దకు వెళ్లి ప్రమాద వశాత్తు ఈనెల 14న కాలుజారి చెరువులో పడి మృతి చెందాడు. మృతుని కుటుంబానికి చంద్రన్న భీమా పథకం ద్వారా మట్టి ఖర్చుల నిమిత్తం రూ.5వేల నగదును శనివారం అందించారు. మిగిలిన రూ.4.95లక్షల నగదును చెక్కు రూపంలో తర్వాత అందజేస్తారని మండల కోఆప్షన్ సభ్యులు షేక్ మస్తాన్ తెలిపారు. కార్యక్రమంలో భీమా మిత్ర ఉషారాణి పాల్గొన్నారు. ఈపూరుపాలెం ఇస్లాంపేటలో నివాసం ఉంటున్న షేక్ ఖాజారహంతుల్లా గుండె పోటుతో మృతి చెందాడు. ఆయన మట్టి ఖర్చుల నిమిత్తం భార్య మస్తాన్‌బికి రూ.5వేల నగదును మండల కోఆప్షన్ సభ్యులు షేక్ మస్తాన్, భీమా మిత్ర జె నాగజ్యోతి అందించారు.