Home ప్రకాశం ఓటరు జాబితాపై నిరంతర పరిశీలన ఉండాలి : మాజీమంత్రి బాలినేని

ఓటరు జాబితాపై నిరంతర పరిశీలన ఉండాలి : మాజీమంత్రి బాలినేని

384
0

ఒంగోలు : పోలింగ్ బూత్‌ కమిటీ కన్వీనర్లు, సభ్యులకు ఓటరు జాబితాపై నిరంతర పరిశీలన ఉండాలని మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి సూచించారు. గురువారం ఉదయం సాయిబాబా గుడి సమీపంలో టంగుటూరి ప్రకాశం పంతులుకు నివాళులు అర్పించిన అనంతరం 37 డివిజన్‌, సాయంత్రం 16వ డివిజన్‌ బూత్‌ కమిటీ కన్వినర్లు, సభ్యులతో వేర్వేరు చోట్ల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా బాలినేని మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్నందున అధికార పార్టీ అనేక జిమ్మిక్కులకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ప్రతి 30 కుటుంబాలను ఓ కార్యకర్త కేటాయించుకొని ఆయా కుటుంబాల్లో ఓటు హక్కు ఉందా? లేదా? అనేది పరిశీలించాలని కోరారు. అర్హులైన వారిని వెంటనే ఓటర్లుగా నమోదు చేయించాలన్నారు.

సర్వర్‌ సమస్యలాంటివి ఉంటే నేరుగా బూత్‌ స్థాయి అధికారిని కలిసి మాన్యువల్‌గా ఓటు నమోదు ప్రక్రియ చేపట్టాలని చెప్పారు. బూత్‌ కమిటీ స్థాయి కార్యకర్తలపైనే పార్టీ విజయం ఆధారపడి ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేస్తే మన ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని తాము చూస్తామని భరోసానిచ్చారు. సమావేశాలకు పార్టీ నగర అధ్యక్షులు శింగరాజు వెంకట్రావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో 37 డివిజన్‌ అధ్యక్షులు జి వెంకారెడ్డి, బూత్‌ కన్వినర్లు రాము, ప్రసన్న, అంజి, వీరారెడ్డి, వెంకటేశ్వర్లు, రాయని వెంకట్రావు, పద్మ, సాయిలక్ష్మి, రమాదేవి, పమ్మి అంజిరెడ్డి, 16వ డివిజన్ అధ్య‌క్షులు భాస్కర్‌, గోగినేని వెంకటేశ్వర్లు, నాగరాజు, సురేష్‌, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.