Home ప్రకాశం ప్రేత్యేక హోదా కోసం బీజేపీపై వత్తిడి పెంచితేనే…

ప్రేత్యేక హోదా కోసం బీజేపీపై వత్తిడి పెంచితేనే…

458
0

చీరాల : రాష్ట్రనికి ప్రత్యేక హోదా సాధించడంలో టిడిపి పోరాటం చేయడంలో విఫలమైందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చీకటి శ్రీనివాసరావు ఆరోపించారు. చీరాల బాపనమ్మ కళ్యాణ మండపంలో బుధవారం జరిగిన రాజకీయ ప్రత్యామ్నాయ సదస్సులో ఆయన మాట్లాడారు. కేంద్రంపై వత్తిడి చేయడంలో వైసిపి తగినంత పోరాటం చేయడంలేదన్నారు. రాష్ట్రాన్నీ నిట్టనిలువునా చీల్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందన్నారు. ఎన్నికలకు ముందు 10ఏళ్ళు హోదా ఇస్తామన్న బిజిపి అధికారానికి వచ్చిన తర్వాత కుదరని చెప్పి మోసం చేసారని చెప్పారు. ఈ విధానాలకు ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను ఏర్పాటు చేసేందుకు సిపిఎం, సిపిఐ ముందుకు వచ్చాయన్నారు.

టిడిపి, బిజెపి, వైసిపి, కాంగ్రెసుకు ప్రత్యామ్నాయంగా కలిసివచ్చే పార్టీలు, సామాజిక సంస్థలతో అభివృద్ధి ప్రణాళిక ప్రాతిపదికన వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా అభివృద్ధికి ప్రతిపాదనలు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటించాలని కోరారు. నూతన రాజధానిలో అభివృద్ధి కేంద్రీకరించకుండా అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చేయాలని కోరారు. నిధులన్నీ ఒకేచోట కాకుండా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేటాయింపు చేయాలని అన్నారు.

చీరాల నియోజకవర్గ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని సిపిఎం కార్యదర్శి ఎన్ బాబూరావు పేర్కొన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధికి సాగునీళ్లు ఇవ్వాలి. వ్యవసాయ విద్యుత్ ఇవ్వాలని కోరారు. తీర ప్రాంతం అభివృద్ధికి పోర్ట్ నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీఐఐసీ ఆధ్వర్యంలో చిన్నతరహా పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రత్యేక హోదాతోనే అభివృద్ధి సాధ్యమని హోదా సాధన సమితి కన్వీనర్ బోయిన వెంకటేష్ పేర్కొన్నారు.

సదస్సుకు సిపిఐ కార్యదర్శి మేడా వెంకటరావు అధ్యక్షత వహించారు. సదస్సులో సిపిఐ జిల్లా మాజీ కార్యదర్శి ఎమ్ వెంకయ్య, సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి ఎన్ బాబురావు, జనసేన నియోజకవర్గ కన్వీనర్ గూడూరు శివరామప్రసాద్, ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ బోయిన వెంకటేష్, బీఎస్పీ నాయకులు కుంచాల పుల్లయ్య, బిసి సంఘం నాయకులు శిద్దాబత్తుని సూర్యప్రకాశరవు, సిపిఎం నాయకులు ఎమ్ వసంతారావు, దేవతోటి నాగేశ్వరరావు, కందుకూరి ఎల్లమంద, పి సాయిరాం, కోండ్రు యోహాను, జి సుధాకర్, ఎం రవిచంద్ర, పి కాలేష, డి నారపరెడ్డి, సిపిఐ నాయకులు బి సాంయేలు, కెఎన్పిఎస్ నాయకులు గుమ్మడి రమేష్, బీఎస్పీ నాయకులు వైజి సురేష్ పాల్గొన్నారు.