ఒంగోలు : “రావాలి జగన్..కావాలి జగన్“ కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ నుండి వైఎస్ఆర్‌సిపి జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గురువారం ప్రారంభించారు. వైఎస్ఆర్‌సిపి అమలు చేయనున్న తొమ్మిది సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచురించిన కరపత్రాలను ఇంటింటికీ తిరిగి ప్రజలకు అందజేస్తూ రానున్న రోజుల్లో వైసిపిని ఆదరించాలని కోరారు. ప్రజలకు అభివాదం చేస్తూ కార్యకర్తలు, అనుచరులతో వెంట నడిచారు. కొత్తపట్నం బస్టాండు నుండి ప్రారంభమైన కార్యక్రమానికి పూలతో స్వాగతం పలికారు.