గిద్దలూరు : భారత తొలిప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా మండలంలోని ముండ్లపాడు అమరావతి ఇంగ్లీషు మీడియం స్కూల్ ఆవరణలో బాలల దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా జరిగిన సభలో మాజీ ఎంఎల్ఎ పిడతల సాయికల్పనారెడ్డి మాట్లాడారు. బాల్యం ఎప్పటికీ తిరిగిరానిదన్నారు. ఆటపాటలతో గడపాల్సిన బాల్యం ఇప్పడు చదువుల బరువులతో పరుగులు తీయిస్తూ పిల్లలపై వత్తిడితి కూడిన చదువుల విధానం ఆందోళన కలిగిస్తుందన్నారు. అలాంటి వత్తడి లేకుండా పిల్లలను సృజనాత్మకంగా అభివృద్ది చేసేవిధంగా ప్రోత్సహిస్తున్న అమరావతి పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు.