Home ప్రకాశం రక్తదానం ప్రాణదానంతో సమానం : మాగుంట రాఘవరెడ్డి

రక్తదానం ప్రాణదానంతో సమానం : మాగుంట రాఘవరెడ్డి

639
0

సింగరాయకొండ (దమ్ము) : రక్తదానం చేయడం మరొకరికి ప్రాణదానం చేయడమేనని ప్రముఖ యువపారిశ్రామికవేత్త, మాగుంట రాఘవరెడ్డి ట్రస్ట్ చైర్మన్ మాగుంట రాఘవరెడ్డి అన్నారు. ఒంగోలు రిమ్స్ వైద్యులచే ప్రభుత్వ పాఠశాల ఆవరణలో రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపౌరుడు బాధ్యతగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినంద నీయమన్నారు. కరోనా వైరస్ తో రిమ్స్ లో చేరి చికిత్స పొందుతున్న ఎంతో మంది రోగులకు రక్తనిల్వలు అత్యవసర రీత్యా ఈ శిబిరం ఏర్పాటు చేశామన్నారు.

వైసీపీ కొండపి నియోజకవర్గ ఇంచార్జి, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య రక్తదాతలను పరీక్షించారు. కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ వైద్యవిభాగం అధ్యక్షులు డాక్టర్ బత్తుల అశోక్ కుమార్ రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి ట్రస్ట్ కొండపి నియోజకవర్గ కోఆర్డినేటర్ పి సాగర్ రెడ్డి, వైసీపీ మండల నాయకులు షేక్ నాయబ్ రసూల్, ఖరీముల్లా, కలికి రోసిరెడ్డి, ముజీబ్ బాషా, గౌడపేరి రాఘవులు, షేక్ నియాజ్ అహ్మద్, షేక్ జిలాని, యరమాల సుబ్బారావు, షేక్ సలీంభాషా, యునైటెడ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ నాయకులు షేక్ సుల్తాన్ పాల్గొన్నారు.