Home ప్రకాశం అన్ని పార్టీలు చీరాల స్థానాన్ని రానున్న ఎన్నికల్లో చేనేతలకే ఇవ్వాలి : పద్మశాలీయ సంఘం డిమాండ్

అన్ని పార్టీలు చీరాల స్థానాన్ని రానున్న ఎన్నికల్లో చేనేతలకే ఇవ్వాలి : పద్మశాలీయ సంఘం డిమాండ్

570
0

చీరాల : పద్మశాలీల సంఘం సర్వసభ్య సమావేశం పేరాల్లోని గోలి సదాశివరావు కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించారు. సమావేశంలో చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. చేనేతలు ఐక్యంగా సమస్యలపై పోరాడాలని హస్తకళల కార్పొరేషన్ డైరెక్టర్ గుడుగుల గంగరాజు, సంఘం రాష్ట్ర అధ్యక్షులు సర్వేశ్వరరావు చెప్పారు.

రానున్న ఎన్నికల్లో చీరాల సీటు అన్ని పార్టీలు చేనేతలకే కేటాయించేవిధంగా వత్తిడి తెచ్చేందుకు ఐక్యం కావాలన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా జి సుందరరామయ్య, కార్యదర్శిగా కౌతారపు జనార్దన్ తోపాటు 19మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో పడవల లక్ష్మణస్వామి, గుద్దంటి సత్యనారాయణ, అండగుండ నారాయణ, అవ్వారు మల్లికార్జునరావు పాల్గొన్నారు.