చీరాల : ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం, విశ్వాసం పెంచేవిధంగా పనిచేయాలని రిటైర్డు ఐఎఎస్ అధికారి, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి పి సుందరకుమార్ పేర్కొన్నారు. కొత్తపేటలోని జెడ్‌పి ఉన్నత పాఠశాల విద్యార్ధులతో ఆయన మంగళవారం మాట్లాడారు. విద్యార్ధి దశనుండే భవిష్యత్తుపై దృష్టిపెట్టి చదవాలని చెప్పారు. తల్లిదండ్రులు ఏ ఉద్దేశంతో పాఠశాలకు పంపుతున్నారో విద్యార్ధులు అర్ధం చేసుకోవాలన్నారు. పరీక్షల్లో ఏవిధంగా ప్రశ్న అడిగినా సమాధానం రాయగలిగే విధంగా పాఠ్యాంశాన్ని అర్ధం చేసుకోవాలని చెప్పారు.