Home ప్రకాశం టిడిపి నిరసన తెలపడం హాస్యాస్పదం : వైసిపి

టిడిపి నిరసన తెలపడం హాస్యాస్పదం : వైసిపి

347
0

చీరాల : అధికారంలో ఉండి, కేంద్రంతో పోటీపడి పెట్రోల్, డీజిల్ పై దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పన్నులు వసూలు చేస్తూ అత్యధిక ధర రాష్ట్రాల్లో పాలదానికి కారణమైన టిడిపి నిరసన తెలపడం హాస్యాస్పదంగా ఉందని వైసిపి పట్టణ అధ్యక్షులు బోనిగల జైసన్ బాబు ఆరోపించారు.

నిన్నటివరకు కాంగ్రెస్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన చంద్రబాబు తెలంగాణాలో మహాకూటమి పేరుతో కాంగ్రెసుతో పొత్తు పెట్టుకునేందుకు వెళ్లారంటే అంతకన్నా సిగ్గుచేటు ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు మోసాలు, ఎన్నికల జిమ్మిక్కులు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వైఎస్సార్సీపి కార్యాలయంలో జరిగిన సమావేశంలో కౌన్సిలర్ కె శ్యామ్, నీలం శ్యామ్, మద్దు ప్రకాశరావు పాల్గొన్నారు.