Home ఆంధ్రప్రదేశ్ 8న చీరాల చేర‌నున్న వైసిపి అధినేత వైఎస్ జ‌గ‌న్‌ ప్రజాసంప‌క‌ల్ప యాత్ర‌

8న చీరాల చేర‌నున్న వైసిపి అధినేత వైఎస్ జ‌గ‌న్‌ ప్రజాసంప‌క‌ల్ప యాత్ర‌

353
0

చీరాల : వైఎస్ఆర్‌సిపి చీరాల నియోజ‌క‌వ‌ర్గ విస్తృత స‌మావేశంలో వైసిపి నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జి య‌డం బాలాజి మాట్లాడుతూ ఈనెల 8న వైసిపి అధినేత జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప యాత్ర నియోజ‌క‌వ‌ర్గంలోకి ప్ర‌వేశిస్తుంద‌ని చెప్పారు. ప‌ర్చూరు నియోజ‌క‌వ‌ర్గం నుండి సంత‌రావూరు మీదుగా వేట‌పాలెంకు చేరుకుంటార‌ని పేర్కొన్నారు. రాత్రికి వేట‌పాలెంలో బ‌స చేస్తార‌ని చెప్పారు. తిరిగి 10వ తేదీన యాత్ర నియోజ‌క‌వ‌ర్గంలో సాగుతుంద‌న్నారు. 10రాత్రికి చీరాల‌లో బ‌స చేసిన జ‌గ‌న్ 11న ఈపూరుపాలెంలో చేనేత స‌ద‌స్సు నిర్వ‌హిస్తార‌ని తెలిపారు.

అనంత‌రం బాప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గంకు యాత్ర సాగుతుంద‌ని తెలిపారు. జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప యాత్ర ఏర్పాట్ల‌ను కార్య‌క‌ర్త‌ల‌తో చ‌ర్చించారు. యాత్ర విజ‌య‌వంతానికి కార్య‌క‌ర్త‌లు కృషి చేయాల‌ని కోరారు. స‌మావేశంలో వైసిపి ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు బొనిగ‌ల జైస‌న్‌బాబు, మండ‌ల అధ్య‌క్షులు పిన్నిబోయిన రామ‌కృష్ణ‌, వేట‌పాలెం అధ్య‌క్షులు కొలుకుల వెంక‌టేష్‌, మున్సిప‌ల్ వైస్‌ఛైర్మ‌న్ కొర‌బండి సురేష్‌, మున్సిప‌ల్ ప్ర‌తిప‌క్ష నాయ‌కులు బుర‌ద‌గుంట ఆశీర్వాదం, నాయ‌కులు య‌డం ర‌విశంక‌ర్‌, కౌన్సిల‌ర్లు, వివిధ గ్రామాల వైసిపి స‌ర్పంచులు రాజు శ్రీ‌నివాస‌రెడ్డి, చీరాల ప‌ట్ట‌ణం, చీరాల మండ‌లం, వేట‌పాలెం మండ‌లం కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు పాల్గొన్నారు.