చీరాల : సినిమాహాళ్లలో రీల్ ద్వారా సినిమా ప్రదర్శన కనుమరుగైంది. డిజిటల్ పద్దతి ప్రస్తుతం అమలులో ఉంది. ఈ పద్దతి ప్రకారం సినిమా డిస్టబ్యూటర్ వద్ద సిగ్నల్ వదిలితే సినిమాహాళ్లలో ఏర్పటు చేసుకున్న సర్వర్ ద్వారా సినిమా ప్రదర్శితమవుతుంది. ఈ సర్వర్ ధరలు మొదట తక్కువే ఉంటాయని చెప్పిన సర్వర్ ప్రొవైడర్స్ ఆతర్వాత సినిమా హాల్ల నిర్వహణకు భారమయ్యేలా పెంచడంతో ప్రొవైడర్స్ ధరలు పెంచారు.
దీంతో సర్వర్ ప్రొవైడర్ ధరలు తగ్గించాలని ప్రొవైడర్స్‌తో సినిమాహాళ్ల యాజమాన్య అసోసియేషన్ దశలవారీగా చర్చలు జరిపింది. చర్చల్లో ధరలు తగ్గించకపోవడంతో సినిమా ప్రదర్శనను రాష్ట్రవ్యాప్తంగా బంద్ చేశారు. అందులో భాగంగా చీరాల పట్టణంలోని సినిమాహాళ్లు మూతపడ్డాయి. యాజమాన్య అసోసియేషన్, సర్వర్ ప్రొవైడర్స్ చర్చలు సఫలమైతేనే సినిమా ప్రదర్శన మొదలవుతుందని, అప్పటి వరకు బంద్ చేస్తున్నట్లు ధియేటర్ల యాజమాన్యం పేర్కొన్నారు.