Home ప్రకాశం ఆంద్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా కోసం వామ‌ప‌క్షాల దీక్ష‌లు

ఆంద్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా కోసం వామ‌ప‌క్షాల దీక్ష‌లు

357
0

చీరాల : రాష్ట్రానికి 10ఏళ్లు ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌న్న బిజెపి, టిడిపి కూటమి రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను మోసం చేశార‌ని సిపిఎం ప్రాంతీయ కార్య‌ద‌ర్శి ఎన్ బాబురావు, సిపిఐ కార్య‌ద‌ర్శి మేడా వెంక‌ట్రావు పేర్కొన్నారు. త‌హ‌శీల్దారు కార్యాల‌యం వ‌ద్ద వామ‌ప‌క్షాల ఆధ్వ‌ర్యంలో సామూహిక దీక్ష‌లు శ‌నివారం నిర్వ‌హించారు. దీక్ష‌లనుద్దేశించి నేత‌లు మాట్లాడుతూ ప్ర‌త్యేక హోదా ఇస్తే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఎవ్వ‌రినీ అడ‌క్కుండానే పారిశ్రామిక వేత్త‌లు రాష్ట్రంలో ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు వ‌స్తార‌ని పేర్కొన్నారు. ప్ర‌పంచ దేశాల‌న్నీ తిరిగి మా రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్ట‌మ‌ని బ్ర‌తిమాలేక‌న్నా కేంద్రంపై వత్తిడి పెట్టి ప్ర‌త్యేక హోదా సాధిస్తే ప‌రిశ్ర‌మ‌లు అవేవ‌స్తాయ‌న్నారు.

పారిశ్రామిక వేత్త‌ల‌ను ఆక‌ర్షించేందుకు అనువైన హోదా వ‌దిలి ప్యాకేజీల‌కు రాజీప‌డి ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికైనా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో పెట్టుకుని ప్యాకేజీల‌కు రాజీప‌డ‌కుండా అఖిల‌ప‌క్షాన్ని కేంద్ర‌వ‌ద్దంకు తీసుకెళ్లేందుకు ముఖ్య‌మంత్రి చొర‌వ తీసుకోవాల‌ని కోరారు. దీక్ష‌ల్లో సిపిఎం నాయ‌కులు ఎం వ‌సంత‌రావు, డి నార‌ప‌రెడ్డి, ఆదిశంక‌ర‌య్య‌, డివైఎఫ్ఐ కార్య‌ద‌ర్శి పి సాయిరాం, జూపూడి రోశ‌య్య‌, సిపిఐ నాయ‌కులు ఎ బాబురావు, సామ్యేలు, కాంగ్రెస్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు గ‌జ‌వ‌ల్లి శ్రీ‌ను, సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కులు గుంటి ఆదినారాయ‌ణ కూర్చున్నారు. దీక్ష‌ల‌కు బిసి ఫెడ‌రేష‌న్ అధ్య‌క్షులు ఊటుకూరి వెంక‌టేశ్వ‌ర్లు, జ‌న‌సేన నాయ‌కులు గూడూరి శివ‌రామ‌ప్ర‌సాద్‌, సిపిఎం నాయ‌కులు గ‌విని నాగేశ్వ‌ర‌రావు, దేవ‌తోటి నాగేశ్వ‌ర‌రావు, కందుకూరి య‌ల్ల‌మంద‌, పి నాగ‌మ‌నోహ‌ర‌లోహియ‌, స‌మాజ్‌వాదీపార్టీ అధ్య‌క్షులు స‌య్య‌ద్ బాబు, ద‌ళిత సంఘాల నాయ‌కులు సంఘీబావం ప్ర‌క‌టించారు.