Home క్రైమ్ హత్యా… ఆత్మహత్య..?

హత్యా… ఆత్మహత్య..?

976
0

చీరాల : ఏం జరిగిందో తెలియదు. అనుమానాస్పద స్థితిలో యువతి మృతి చెందిన ఘటన రామాపురం బీచ్ లో గురువారం చోటుచేసుకుంది. చీరాల రామమందిరం వీధికి చెందిన కోట గౌతమి ఒంటిపై సగం దుస్తులతో బీచ్ లో మృతి చెంది ఉండటాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

మృతదేహాన్ని చూసి యువతిని గుర్తించారు. తెల్లవారుజాము నుండి కనిపించక పోవడంతో కుటుంభం సభ్యులు ఇంటి పరిసరాల్లో విచారిస్తున్నట్లు, పోలీసుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. డిఎస్పీ ప్రేమకాజల్, రురల్ సిఐ భక్తవత్సాలరెడ్డి పరిశీలించారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నదా లేక హత్య జరిగిందా అనేది పోలీస్ విచారణలో తెలియాల్సి ఉంది.