Home ఆంధ్రప్రదేశ్ ఇక వారి సేవలోనే… సీబీఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ప్రకటన ఇదే…!

ఇక వారి సేవలోనే… సీబీఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ప్రకటన ఇదే…!

461
0

అమరావతి :  సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా… పలు సంచలన కేసులు డీల్ చేసి నిజయతీపరుడైన అధికారిగా అందరి మన్ననలు పొందిన లక్ష్మీ నారాయణ తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. ఆయన తన ఉద్యోగానికి రాజీనామా ప్రకటించిన నాటి నుంచి రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ పెద్దఎత్తున ప్రచారం జరిగింది. జనసేనలో చేరుతారని… కాదు బీజేపీలోకి వెళ్తారని ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే బుధవారం తన రాజీనామా ఆమోసం పొందడంతో ఇవాళ లక్ష్మీ నారాయణ తాను ఎమ్ చేయబోతున్నది చెప్పారు. కొన్నాళ్లుగా నెలకొన్న ఊహాగానాలకు తెరదించారు.

ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు నెలలకోసారి ఇంక్రిమెంట్లు వస్తాయని, అన్నదాతలకు ఇంక్రిమెంట్లు ఉండవా? అంటూ ఆయన గుంటూరు జిల్లాలో ప్రశ్నించారు. రైతు సేవ కోసమే ఉద్యోగానికి రాజీనామా చేశానని లక్ష్మీనారాయణ వెల్లడించారు. గొప్ప మనసున్న వ్యక్తి రైతు అని కొనియాడారు. కష్టం, ఆనందం, ధైర్యం ఉండేవాడే రైతు అని వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం యాజిలిలో రైతులతో లక్ష్మీనారాయణ సమావేశమయ్యారు. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సులో పాల్గొన్నారు.

గ్రామాల్లో రైతుల కోసం పనిచేస్తానని ప్రభుత్వాన్ని కోరానని.. అవకాశం రాలేదన్నారు. ‘‘నేను వ్యవసాయ మంత్రినైతే మీ కోసం ఏం చేయాలో ఆలోచిస్తా. వ్యవసాయ మంత్రిని కాకుంటే సోషల్‌ వర్కర్‌గా పనిచేస్తా. నేను ఒక్కడిగా ఏం చేయలేను.. సంఘటితంగా ఏదైనా సాధించవచ్చు. రైతుల జీవితాల్లో వెలుగులు పండిచాలన్నదే మా ప్రయత్నం. పవిత్ర గ్రామమైన యాజిలీలో ఈ యజ్ఞానికి పూనుకున్నా. ఈ యజ్ఞాన్ని చెడగొట్టేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు’’ అని లక్ష్మీనారాయణ ఆరోపించారు.