Home విద్య శ్రీనివాస రామానుజన్ చిత్రము విడుదల

శ్రీనివాస రామానుజన్ చిత్రము విడుదల

895
0

నేడు శ్రీనివాస రామానుజన్‌ వర్ధంతి
(1987 డిసెంబర్ 22- 1920 ఏప్రిల్ 26)

అంటే మనదేశంలో అందరికీ తెలుసు..

ముఖ్యంగా చదువుకున్న వాళ్లకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఆయన పేరు సుపరిచితమే..

భారత దేశం గొప్పగా చెప్పుకోగలిగిన ప్రపంచ గణిత మేధావి ఆయన..
మరి ఆ మహనీయ గణిత శాస్త్రవేత్త గురించి భావి తరాల వారికి తెలియజేసే విధంగా మన ప్రభుత్వాలు తీసుకొన్న చర్యలు ఏమిటి?…

మహా అయితే ఆయన పుట్టిన రోజైన డిశంబర్ 22 న జాతీయ గణిత దినోత్సవం జరుపుకొని చేతులు దులుపుకుంటాం.
అలానే ఆయన వర్దంతి April 26th.
అయితే శ్రీనివాస రామానుజన్ గురించిన సమగ్రమైన సమాచారం కేంద్ర ప్రభుత్వం వద్ద కానీ, తమిళనాడు ప్రభుత్వం వద్ద కానీ, మనదేశపు ప్రముఖమైన గణిత క్లబ్ ల వద్ద కానీ ఉన్నదా?

ఇవి సరైన సమాధానం దొరకని ప్రశ్నలు. అసలు ఆయన జీవితం, వారి గణిత పరిశోధనల గురించిన లోతైన పరిశీలన మన ప్రభుత్వాలు జరిపించాయో లేదో తెలియదు..
అయితే మనకు ఈ అధ్భుతమైన అవకాశాన్ని హాలీవుడ్ కల్పించింది..
అవును శ్రీనివాస రామానుజన్ గారి జీవితం, వారి గణిత మేధాశక్తి, గణిత పరిశోధనలు, వారి జీవిత కష్టాలు, ఎదుర్కొన్న ఛీత్కారాలు మరియు పొందిన సత్కారాలు మొదలైన వివరాలతో ఓ చిత్రం రూపొందించారు..

The Man Who Knew Infinity

అనే పేరుతో ఇంగ్లండ్, యూరప్ దేశాలలో ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం.. కలెక్షన్ల వర్షం కురిపించింది.
హాలీవుడ్ కి మన రామానుజన్ చరిత్ర నచ్చి.. తర్వాత తరాల వారికి ఆయన గురించి తెలియజేయటానికి, ప్రపంచ వ్యాప్తంగా అందరికి ఆ మహానుభావుని చరిత్ర ను చూపించలని ఏకంగా ఒక సినిమా నే తీయడం మనం హర్షించవలసిన విషయం.

The Man Who Knew Infinity అంటే అర్ధం “అనంతం గురించి తెలిసిన వ్యక్తి”.

ఈ సినిమా భారత దేశం లో ఏప్రిల్26(2016) శ్రీనివాస రామానుజన్ వర్ధంతి సందర్బంగా, ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్29న విడుదలవుతుంది..

అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..
శ్రీనువాస రామానుజన్ గురించి పాశ్చాత్యులకు తెలిసిన విషయాల్లో సగం కూడా భారతీయులకు, మరీ ముఖ్యంగా తమిళులకు తెలియక పోవటం… ఎంతైనా బాధపడాల్సిన విషయం.
ఈ చిత్రాన్ని హాలీవుడ్ లో చూసిన అనేకమంది భారతీయులు శ్రీనువాస రామానుజన్ ఇంతటి గొప్పవాడా… ఇతని జీవితం లో ఇన్ని మలుపులున్నాయా అని ఆశ్చర్యపోతున్నారు.

https://youtu.be/VsSjDgIkDAA )