చీరాల : ప్రకాశం జిల్లా చీరాల కామాక్షి కేర్ హాస్పిటల్‌లో గురువారం ఉచిత ప్లాస్టిక్ సర్జరీ వైద్యశిభిరం నిర్వహించారు. గుంటూరు అమేజ్ మెడ్ స్పా లో ప్రముఖ ప్లాస్టిక్ జర్జన్ డాక్టర్ సుమిత శంకర్ వైద్యపరీక్షలు చేశారు. అమెరికా, దుబాయ్ వంటి ప్రాంతాల్లో వైద్యం చేసి విశేష అనుభవం కలిగిన ఆమె గుంటూరులోనే ఉండి వైద్యసేవలందిస్తున్నారు. బెంగుళూరు, హైదరాబాద్, విజయవాడ వెళ్లనవసరం లేకుండానే చీరాలలోనే ప్రాధమిక పరీక్షలు చేయడంతోపాటు కొన్ని ఆపరేషన్లు కూడా చేస్తారని కామాక్షి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు తెలిపారు. ఖరీదైన ప్లాస్టిక్ జర్జరీ వైద్యం తమ వైద్యశాలలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిభిరంలో పరీక్షలు చేయించుకున్నవారికి తక్కువ ఖర్చుతో వైద్యం చేస్తారని తెలిపారు. కాలిన గాయాలు, బరువు తగ్గించుకునుట, మహిళల్లో బ్రస్ట్ సైజు తగ్గించుట, పెంచుట వంటి సమస్యలపై వైద్యపరీక్షలు చేశారు.