Home ఆంధ్రప్రదేశ్ వైఎస్‌ జగన్‌ను కలిసిన పొగాకు రైతులు

వైఎస్‌ జగన్‌ను కలిసిన పొగాకు రైతులు

377
0

క‌నిగిరి : వైసిపి అధినేత‌, ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌ గురువారం హజీస్‌పురం చేరుకుంది. యాత్ర‌లో ఆయ‌న‌ను పొగాకు రైతులు కలిశారు. పొగాకుకు గిట్టుబాటు ధ‌ర లేద‌ని, ఆకు నాణ్య‌త లేదంటూ కొనుగోలు చేయ‌డం లేద‌ని రైతులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మ‌నంద‌రి ప్రభుత్వం రాగానే న్యాయం చేస్తామని వైఎస్‌ జగన్‌ రైతులకు హామీ ఇచ్చారు.

అక్షయ గోల్డ్ బాధితులు కూడా వైఎస్‌ జగన్‌ను క‌లిశారు. ఒత్తిళ్లు తట్టుకోలేక 87 మంది ఏజెంట్లు ఆత్మహత్య చేసుకున్నారని అక్షయ గోల్డ్ బాధితులు జ‌గ‌న్ ఎదుట‌ వాపోయారు. ఇక గుడి భూములు, పేదల భూములను కబ్జాలు చేస్తున్న టీడీపీ నేతలు చివరకు జాలర్లను కూడా వదలడం లేద‌న్నారు. చేపలు పట్టుకునే మోపాడు రిజర్వాయర్ను ఆక్రమించుకుని జాలర్ల పొట్టగొడుతున్నారని పేర్కొన్నారు. 95వ రోజు పాదయాత్ర రామపురం, గుదేవారిపాలెం క్రాస్‌ మీదగా, హజీస్‌పురంకు చేరుకుంది. రాత్రికి అక్క‌డే బ‌స చేశారు. ఇప్పటివరకూ ఆయన 1,275.9 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు.