Home సినిమా న‌మ్ర‌త‌శిరోద్క‌ర్‌పై మ‌లైకా అరోరా ఆరోప‌ణ‌లు

న‌మ్ర‌త‌శిరోద్క‌ర్‌పై మ‌లైకా అరోరా ఆరోప‌ణ‌లు

532
0

హైద‌రాబాద్ : న‌మ్ర‌త శిరోద్క‌ర్ పేరు విన‌గానే బాలివుడ్ చిత్రాలు గుర్తొస్తాయి. బాలివుడ్ చిత్రాలే కాదు ఆమె ఇప్పుడు ప్రిన్స్‌ మహేష్ బాబు భార్య కూడా. ప్ర‌స్తుతం ఆమె స్క్రీన్‌కు దూరమైంది. కానీ గతంలో ఆమె ఒక టాప్ మోడల్. అంతే కాదు. ఫేమస్ బాలీవుడ్ హీరోయిన్ కూడా. లేట్ నైంటీస్‌లో ఈమె హవా బాగానే న‌డిచింది. వివాదాలకు దూరంగా ఉండే ఆమెపై. ఇప్పుడో భామ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఆమె ఎవరో కాదు. అతిథి చిత్రంలో మహేష్ బాబుతో కలిసి ‘రాత్రయిన నాకు ఓకే’ అంటూ ఆడి పాడిన మలైకా అరోరా.

ఆమె నమ్రతపై వ్యక్తిగతమైన కామెంట్స్ చేయలేదు. కానీ.. ప్రొఫెషనల్ సైడ్ మాత్రం రివీల్ చేసింది. అప్పట్లో మలైకా అరోరాకు ఇండస్ట్రీ కొత్తట‌. ఆ సమయానికే నమ్రతా శిరోద్కర్ టాప్ మోడల్. అలాంటి సమయంలో అరోరాపై సీనియర్ అయిన నమ్రత. అథారిటీ చూపించేదట. మెహర్ జెస్సియా అనే మోడల్ తో కలిసి. నమ్రత ఓ గ్యాంగ్ మాదిరిగా వ్యవహరించేవారట. ప్రస్తుతం ఈ మెహర్ జెస్సియా. అర్జున్ రాంపాల్‌ను పెళ్లి చేసుకుని సెటిలైంది. నేహాధూపియా నిర్వహించే వోగ్-బీఎఫ్ఎఫ్ కార్యక్రమంలో ఈ విషయాలను మలైకా అరోరా చెప్పింది.