చీరాల : జాతీయ స్థాయి పేపర్ ప్రజెంటేషన్‌లో సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కాలేజి విద్యార్ధికి ప్రధమ బహుమతి సాధించినట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు. నర్సరావుపేట తిరుమల ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన జాతీయ స్థాయి స్పోర్ట్స్, కల్చరల్ సిపోజియం ప్రయాగలో తమ కళాశాల మెకానికల్ విద్యార్ధులు పేపర్ ప్రజెంటేషన్‌లో మొదటి బహుమతి సాధించినట్లు తెలిపారు. విద్యార్ధులను కళాశాల ప్రన్సిపాల్ డాక్టర్ పి రవికుమార్, మెకానికల్ హెచ్ఒడి వి లక్ష్మినారాయణ అభినందించారు.