బాపట్ల : విద్యార్ధులు ర్యాగింగ్‌కు పాల్పడితే జీవితం కోల్పోతారని సిఐ వినయ్‌కుమార్ విద్యార్ధులకు సూచించారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో గురువారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని తల్లిదండ్రులు ఆశయాలను నెరవేర్చితే జీవితంలో ఉన్నత మైన భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. తోటి విద్యార్థులతో స్నేహాభావంతో కలిసి ఉండాలని చెప్పారు. ర్యాగింగ్‌కు పాల్పడొద్దని చెప్పారు. ర్యాగింగ్‌కుపాల్పడితే జైలు జీవితం గడపాల్సి వస్తుందని హెచ్చరించారు. ర్యాగింగ్‌కు పాల్పడితే జరిగే పరిణామాలను చట్టాలు, శిక్షలతో వివరించారు.