చీరాల : పట్టణంలోని స్వర్ణరోడ్డులోని శివదత్తక్షేత్రం ఆవరణలో లోకకళ్యాణం కోసం లక్షదత్తహోమాలు బుధవారం వైభవంగా నిర్వహించారు. దత్త జయంతి సందర్భంగా మూక్కోటి లక్షల హోమాలు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న దత్తభక్తులు లక్షహోమాలు చేశారు. గణపతిసచ్చిదానంద స్వామి ఆశీస్సులతో దత్త విజయానందతీర్ధ సంకల్పంతో హోమాలు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.